అంతర్జాతీయం

కర్తార్‌పూర్‌ కారిడార్‌పై పాకిస్థాన్ కొత్త కొర్రీ

కర్తార్‌పూర్‌ కారిడార్‌పై పాకిస్థాన్ కొత్త కొర్రీ
X

pak

కర్తార్‌పూర్‌ కారిడార్‌పై పాకిస్థాన్ పదే పదే మాటలు మారుస్తోంది. రోజుకో కొర్రీ వేస్తూ కొత్త తగాదాలు తెచ్చిపెడుతోంది. తాజాగా వీసాల విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కర్తార్ పూర్ సందర్శనకు వచ్చే భారత యాత్రికులు, కచ్చితంగా పాస్‌పోర్టు తీసుకురావాలని స్పష్టం చేసింది. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నా మని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలకు విరుద్దంగా ఉన్నాయి. కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే భారతీయ సిక్కులు పాస్‌పోర్టు చూపించాల్సిన అవసరం లేదని నవంబర్ ఒకటో తేదీన ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందని చెప్పారు. వారం రోజుల్లోనే పాకిస్థాన్ మాట మార్చింది. యాత్రికులకు పాస్‌పోర్టు ఉండాల్సిందేనని చెబుతోంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇంకొక్క రోజే మిగిలి ఉన్న సమయంలో పాకి స్థాన్ ఇలా మాట మార్చడం వివాదం రేపుతోంది.

కర్తార్‌పూర్ కారిడర్‌ విషయంలో పాకిస్థాన్ రాద్దాంతం అంతా ఇంతా కాదు. ఎంట్రీ ఫీజును 20 డాలర్లుగా నిర్ణయించిన పాక్ ప్రభుత్వం, ఆ రుసుమును తగ్గించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. యాత్రికుల సంఖ్య పెంచడానికి, ఇతర విష యాల్లోనూ మొండిగా వ్యవహరించింది. ఇక, కర్తార్‌పూర్‌ కారిడర్‌పై రూపొందించిన ప్రమోషనల్ వీడియోలోను తన కపటబుద్ధి చూపించింది. ఖలిస్థాన్ తీవ్రవాదులు జర్నై ల్ సింగ్ బింద్రన్‌వాలే, షాబేగ్‌ సింగ్, అమ్రిక్ సింగ్ ఖల్సాల ఫోటోలను కర్తార్‌పూర్ వీడియోలో ప్రదర్శించింది. పాక్ తీరుపై అటు భారత ప్రభుత్వం, ఇటు పంజాబ్ సర్కారు తీవ్రంగా మండిపడ్డాయి. ఖలి స్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పంజాబ్‌లో చిచ్చు పెట్టడానికి పాక్ కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తాయి.

Next Story

RELATED STORIES