వావ్.. వాటే క్రేజీ బాడీ.. హీరో కండలు చూసి సమంత ప్లాట్..

వావ్.. వాటే క్రేజీ బాడీ.. హీరో కండలు చూసి సమంత ప్లాట్..
X

75349023_2264993567131993_5374081673115729920_n

ఇద్దరూ కలిసి ఓ బేబీలో నటించారు. అప్పటినుంచే వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అప్పుడప్పుడూ హీరో హీరోయిన్లు జిమ్‌లో వారు చేసిన వర్కవుట్ల గురించి అభిమానులకోసం షేర్ చేస్తుంటారు. ఈ కోవలో సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీత్ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు. తాజాగా నాగశౌర్య కూడా తన బాడీని చూపిస్తూ బిల్డప్‌ ఇస్తున్నాడు. అది చూసిన సమంత ప్లాటైపోయి వెంటనే రిప్లై ఇచ్చింది. ఓ గాడ్.. వాట్ ఈజ్ దిస్ క్రేజీనెస్ అంటూ కామెంట్ పెట్టి స్మైలీ ఎమోజీని పోస్ట్ చేసింది.

నాగశౌర్య కండలు తిరిగిన తన బాడీ ఫోటోతో పాటు ఓ క్యాప్షన్ కూడా రాద్దామనుకున్నాడట. కానీ ఇంతలో వాళ్ల నాన్న చూసి చాలు చాల్లే.. క్యాప్షన్లు గీప్షన్లు ఏమక్కర్లా.. ఫోటో ఒక్కటీ పోస్ట్ చేయి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో నాగశౌర్య బుద్దిమంతుడిలా ఫోటో ఒక్కటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా, తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత, శర్వానంద్ నటిస్తున్నారు. దిల్ రాజు చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ చిత్రం ప్రేమికుల రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Next Story