గృహిణిని హత్యచేసి ఇంటికి తాళం వేసిన దుండగులు

X
TV5 Telugu7 Nov 2019 11:51 AM GMT
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని అత్తాపూర్‌లో దారుణం జరిగింది. రాంబాగ్‌లో జ్యోతి అనే గృహిణిని దుండగులు అత్యంత దారుణంగా హత్యచేశారు. జ్యోతిని చంపి ఇంటికి తాళం వేసి దుండగులు పరారయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇంటి నుంచి దుర్వావసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళాలు పగలగొట్టి చూడగా జ్యోతి దారుణహత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. మృతురాలు జ్యోతి స్వస్థలం కర్ణాటక. భూ వివాదంలో జ్యోతి భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story