6జీపై కన్నేసిన డ్రాగన్

6జీపై కన్నేసిన డ్రాగన్

chia

టెలికాం రంగంలో చైనా దూసుకుపోతోంది. మిగతా దేశాలు 5జీ నెట్‌వర్క్‌ను అందింపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉండగానే.. డ్రాగన్ కంట్రీ అప్పుడే 6జీపై కన్నేసింది. ఇప్పటికే ఆదేశంలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 6 జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనుల కోసం.. 2 గ్రూపులను ప్రారంభించింది చైనా. టెలికాం రంగంలో అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి గండికొట్టి.. ప్రపంచ శక్తిగా ఎదగాలన్నదే ఆ దేశ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై ఇంకా అస్పష్టత ఉంది. దాన్నెలా ఉపయోగించాలనే దానిపై ఏకాభిప్రాయం లేదు.

ప్రస్తుతమున్న4జీతో పోలిస్తే 5జీలో కనీసం 20 రెట్లు వేగంగా డేటా లభిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలకు ఎంతో ఉపకరిస్తుంది. చైనా గత నెల 31న 5జీ సర్వీసులను ప్రారంభించింది. దీని డౌన్‌లోడ్ వేగం 4జీ కన్నా 10 నుంచి 100 రెట్లు ఎక్కువ. దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ కూడా ఈ ఏడాది 5జీ సేవలను ప్రారంభించాయి. మనదేశంలో 5జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇందుకోసం.. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రపంచదేశాలు ఇంకా 4జీ దశలో ఉన్న సమయంలోనే చైనా 6జీ అంటూ సరికొత్త సంచలనానికి తెరతీసింది. చైనా ప్రయోగాలు ఫలిస్తే టెలికాంరంగం రూపురేఖలే మారిపోనున్నాయి. డౌన్‌లోడ్ వేగం 5జీ కన్నా మరింత వేగంగా ఉంటుంది. ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలు ప్రపంచాన్ని శాసిస్తాయి. టెలికాం రంగంలో ఇప్పటికే అమెరికాను వెనక్కినెట్టిన చైనా.. ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటికన్నా ముందే 6జీని అందుబాటులోకి తెవాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది.

Tags

Read MoreRead Less
Next Story