ఆర్టీసీపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష

cm-kcr

ఆర్టీసీపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థితో పాటు, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సీఎస్‌ జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హైకోర్టు సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. పొరుగు రాష్ర్టాలకు ఎన్నో పథకాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది. దానికి సీఎస్‌ సహా ఇతర అధికారులకు వ్యక్తిగత హాజరును మినహాయించింది. దీనిపై కోర్టుకు ఏం చెప్పాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించారు..

Tags

Read MoreRead Less
Next Story