కాసేపట్లో వివాహం జరుగుతుందనగా పెళ్లి కుమారుడు..

X
TV5 Telugu10 Nov 2019 9:23 AM GMT
హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో దారుణం జరిగింది. కాసేపట్లో వివాహం ఉండగా.. అంతలోనే పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొంపల్లిలోని శ్రీఫంక్షన్ హాల్‌లో పెళ్లి కుమారుడు సందీప్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో వివాహం కావాల్సిన కుమారుడు ఇలా అర్ధ్రాంతరంగా చనిపోవడంతో.. అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు.
Next Story