బోల్తా పడిన బంగ్లాదేశ్.. టీమిండియా గ్రాండ్‌ విక్టరి

బోల్తా పడిన బంగ్లాదేశ్.. టీమిండియా గ్రాండ్‌ విక్టరి

india-vs-bangladesh

చాహర్‌ మ్యాజిక్‌తో నాగ్‌పూర్‌ టీ-20లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ సాధించింది.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ బోల్తా పడింది.. ఫలితంగా 2-1 తేడాతో టీ-20 సిరీస్‌ను రోహిత్‌ సేన కైవసం చేసుకుంది.. తొలి మ్యాచ్‌లో పరాభవాన్ని చవిచూసినా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌ రౌండ్‌షోతో అదరగొట్టింది టీమిండియా.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ రెండు పరుగులకే పెవిలియన్‌ బాట పట్టాడు. రెండో ఓవర్‌లో షఫీల్‌ వేసిన బాల్‌కు రోహిత్‌ శర్మ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ధవన్‌ కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయాడు. 19 పరుగులకే ఔటయ్యాడు. దీంతో 35 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన మొదట రాహుల్‌, అయ్యర్‌ ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. హాఫ్‌ సెంచరీ చేసి రాహుల్‌ ఔటైనా.. అయ్యర్‌ మాత్రం తన జోరును కొనసాగించాడు. అఫిఫ్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు సాధించి టీ20ల్లో తొలి అర్థ సెంచరీ సాధించాడు. చివర్లో మనీష్‌ పాండే దాటిగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి టీమిండియా 174 పరుగులు చేసింది.

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మొదట దూకుడు చూపించింది. ఓపెనర్‌ మహమ్మద్‌ నైమ్‌ 81 పరుగులు సాధించడంతో ఓ దశలో బంగ్లా విజయం ఖాయంలా కనిపించింది. అయితే, చాహర్‌ మ్యాజిక్‌తో సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. చాహర్‌ తన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌కు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో కీలక బ్యాట్స్‌మెన్‌ లింట్‌డాస్‌, సౌమ్య సర్కార్‌, మిథున్‌ను పెవిలియన్‌ చేర్చిన రాహుల్‌.. చివరల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్రను పోషించాడు. టీ-20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఇండియన్‌గా చాహర్‌ రికార్డుల్లో నిలిచాడు. 2012లో జింబాబ్వేపై 8 పరుగులకు ఆరు వికెట్లతో శ్రీలంక బౌలర్‌ మెండిస్‌ నెలకొల్పిన రికార్డును చాహర్‌ తిరగరాశాడు. ఫలితంగా థర్డ్‌ టీ-20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-1 తేడాతో రోహిత్‌ సేన కైవసం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story