తాజా వార్తలు

కాచిగూడలో రైలు ప్రమాదానికి కారణమేంటీ?

కాచిగూడలో రైలు ప్రమాదానికి కారణమేంటీ?
X

TRAIN

హైదరాబాద్‌ కాచిగూడలో రైలు ప్రమాదానికి కారణమేంటనే దానిపై తీవ్రంగా చర్చ జరుగతోంది. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పని చేయలేదని కొందరు, లోకో పైలెట్‌ల మధ్య సమన్వయ లోపమే కారణమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రస్తుతం రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మూడు బోగీలు పక్కకు ఒరిగాయి.. పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది..

ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపం కారణంగానే ప్రమాదం జరిగింది అంటున్నారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లడానికి MMTS రైలుకు.. మరో ఫ్లాట్‌ఫాంపై ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కు ఒకే సారి సిగ్నల్‌ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగింది అంటున్నారు. రెండు రైళ్ల ఇంజిన్లు ఒకేసారి బలంగా ఢీకొట్టడంతో.. రైల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, తోటి ప్రయాణికులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం తరలించారు. MMTS రైలు డ్రైవర్‌ శేఖర్‌.. ఇంజిన్‌ కేబిన్‌లోనే చిక్కుకునిపోయాడు.

రైల్వే అధికారుల మాత్రం సిగ్నిల్‌ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదంటున్నారు. కేవలం హంద్రీ ఎక్స్‌ ప్రెస్‌కు మాత్రమే సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందని.. మరి MMTS లోకో పైలెట్‌ ఎందుకు ట్రైన్‌ను ఎందుకు నడిపాడో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనను విచారించిన తరువాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్‌ తెలిపారు.

Next Story

RELATED STORIES