మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య

X
TV5 Telugu13 Nov 2019 7:10 AM GMT
మహబూబాబాద్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 39 రోజులుగా సమ్మెలో పాల్గొన్న ఆవుల నరేష్ అనే కార్మికుడు గత కొద్దిరోజులుగా ఆందోళనగా ఉంటున్నాడు. అటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చాడు. తీవ్ర మనోవేదనకు గురైన నరేష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా.. తమను రోడ్డు పాలు చేసిందని లేఖలో పేర్కొన్నాడు. ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేశారు.
Next Story