తాజా వార్తలు

'జబర్దస్థ్' షో.. రెమ్యునరేషన్‌లోనూ టాపే..

జబర్దస్థ్ షో.. రెమ్యునరేషన్‌లోనూ టాపే..
X

jabardasth

షోలో అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే అంటూనే జబర్దస్త్ షో చూడడానికి రెడీ అయిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. పార్టిసిపెంట్స్ చేసే కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆధ్యంతం నవ్వులు పూయించే 'జబర్దస్త్' కమెడియన్స్‌ జీవితాల్లో వెలుగులు పంచింది. నలుగురిలో గుర్తింపునీ, నాలుగు డబ్బులు వెనకేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జడ్జిలుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు, రోజాలకు రెమ్యునరేషన్ భారీగానే.. నెలకు రూ.20 నుంచి 25 లక్షల వరకు అందుతుందని సమాచారం. యాంకర్స్ రష్మీ, అనసూయల విషయానికి వస్తే నెలకు రూ.4 నుంచి 5 లక్షల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక టీమ్ లీడర్స్ విషయానికి వస్తే చమ్మక్ చంద్ర హైపర్ ఆది కంటే ఎక్కువగా నెలకు రూ.4 లక్షల వరకు తీసుకుంటే, సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, హైపర్ ఆది రూ.3 లక్షలు, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ.2.5 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం. బుల్లెట్ భాస్కర్ రూ.2 లక్షలు అందుకుంటే, ఇతర కమెడియన్లు నెలకు రూ.50వేల నుంచి రూ.లక్షవరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

Next Story

RELATED STORIES