పిల్లలతో పాటు అతడి పక్కలో పా.. ము కూడా..

పిల్లలతో పాటు అతడి పక్కలో పా.. ము కూడా..

python

ఏం తల్లీ.. ఇంట్లో వాళ్లు సరిపోలేదా.. వీధిలో ఉన్న కుక్కల్నీ, పిల్లుల్లీ వెంటేసుకు వస్తున్నావ్.. అని అమ్మ అరిస్తే వాటిని పెంచుకోవాలని ప్రేమ ఉన్నా ప్రేమగా తెచ్చుకున్న ఆ బుజ్జి కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో వీధిలోనే వదిలేసి రావాల్సిన పరిస్థితి. మరి అతడు పెంచుకునేది పిల్లినో.. కుక్కనో కాదు.. పైథాన్‌ని. ఎక్కడో అడవుల్లో తిరిగే 8 ఇంచుల కొండచిలువను తీసుకు వచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాడు ఇంగ్లాండ్‌కి చెందిన మార్కస్ హబ్స్. ట్యూక్స్‌బరీలో నివసిస్తున్న ఇతడికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిల్లలతో పాటు సమానంగా ప్రేమిస్తుంటాడు. పైథాన్‌కి ఆహారంగా రోజూ కుందేళ్లు, జింక, దుప్పి

పిల్లలు, పంది పిల్లలను పెడుతుంటాడు. ఇప్పుడది 110 కిలోల బరువు, 18 అడుగుల పొడవు పెరిగిందని సంతోషంగా చెబుతాడు మార్కస్. దానికి ఆకలేస్తే అమాంతం మింగేస్తుంది కదా.. పిల్లలు ఉన్న ఇంట్లో ఇంత ప్రమాదకరమైన జంతువుని పెంచడం కరెక్ట్ కాదేమో అంటే.. దానికి రోజూ సరిపడా ఆహారం అందిస్తాను. అయినా దాని స్వభావాన్ని మార్చుకోదని, ఏ టైమ్‌లో ఏం చేస్తుందో అని ముందు జాగ్రత్తగా దానికో సెపరేట్ రూమ్, బెడ్ కేటాయించానని చెబుతున్నారు. పిల్లలను దాని దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చూసుకుంటారు. పిల్లలతో సమానంగా, ఫైథాన్‌ని ప్రేమిస్తున్నారు.

Read MoreRead Less
Next Story