తాజా వార్తలు

ఓవర్ స్పీడ్ వల్లే రాజశేఖర్ కారుకు రోడ్డు ప్రమాదం?

ఓవర్ స్పీడ్ వల్లే రాజశేఖర్ కారుకు రోడ్డు ప్రమాదం?
X

acc

హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో రాజశేఖర్‌ గాయపడ్డారు. రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఆయన స్పీడ్‌గా కారు నడుపుతూ వెళ్లడం వల్లే ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ వల్ల కంట్రోల్ కాక.. కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం మొత్తం తుక్కుతుక్కయిపోయింది. పెద్ద ప్రమాదమే జరిగినా అదృష్టవశాత్తూ రాజశేఖర్ క్షేమంగా బయటపడ్డారు. ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడం వల్ల ఆయన సేఫ్‌ అయ్యారు. అటు, ఈ యాక్సిడెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మితిమీరిన వేగంతో కారు నడిపిన రాజశేఖర్‌పై IPC సెక్షన్ 279, 336 కింద కేసులు పెట్టారు.

ప్రమాదం జరిగినప్పుడు కారు 180 స్పీడ్‌లో ఉంది. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండకు వచ్చాక యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనతో ఆయన ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కాసేపటి తర్వాత మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, స్వల్ప గాయాలతో బయటపడ్డానని రాజశేఖర్ అన్నారు.

Next Story

RELATED STORIES