ఆది..మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరమా.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

శృతి మించే కామెడీ.. నొప్పించే పంచులు.. హైపర్ ఆదీ సెటైర్లు.. జబర్ధస్త్ కమెడియన్స్ కాస్త ఓవరగానే కామెడీ చేస్తారని పేరున్నా.. అందులో ఆది ఎవర్నీ వదిలి పెట్టడు. అదేమంటే నొచ్చుకోవలసిన పనేలేదు. అదంతా తూచ్.. ఉత్త కామెడీనే అని తను చేసిన పనిని కవర్ చేసుకుంటాడు. మెగాస్టార్ చిరంజీవిని కూడ వదిలిపెట్టవా అంటూ ఆదిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పేరుతో సైరాని తీస్తే దాన్ని కూడా స్కిట్ చేసి పారేశాడు ఆది. అందులోనే మగధీర, బాహుబలి సినిమాలను కలిపి ఆడేశాడు.
గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ ఇలా ఏది చేయాలనిపిస్తే దాన్ని చేస్తూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయినా అవన్నీ లైట్ తీసుకుంటూ తన దారిన తాను వెళుతున్నాడు. ఆది ఆగే ప్రసక్తే లేదంటూ ముందుకు వెళుతున్నాడు. మెగా ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేయకు ఆది అంటూ వార్నింగులు ఇస్తున్నారు. ఆది మాత్రం తానేం చేసినా కామెడీ కోసమే అని.. ప్రేక్షకులను నవ్వించడమే తన లక్ష్యమని అంటున్నాడు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకునేది లేదని తేల్చి చెబుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com