భారత్-అమెరికా మధ్య స్నేహబంధం బలోపేతం

భారత్-అమెరికా మధ్య స్నేహబంధం బలోపేతం

indo-us

భారత్-అమెరికా త్రివిధ దళాల పరస్పర సహకార శిక్షణ కార్యక్రమానికి తూర్పు నావికాదళం వేదికైంది. విశాఖ-కాకినాడ సముద్ర జలాల్లో ఈనెల 21న సంయుక్త విన్యాసాలు జరపనున్నారు. టైగర్ ట్రంప్‌ 2019 పేరుతో వాటిని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా INS జలాశ్వపై మార్చ్‌ జరిగింది.

భారత్-అమెరికా మధ్య స్నేహబంధం బలోపేతం అవుతున్నట్టు అమెరికా దౌత్యవేత్త కెన్నత్ జస్టర్‌ అన్నారు. రెండు దేశాల మధ్య మిలటరీ సహకారానికి సంయుక్త విన్యాసాలు దోహదం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్లు, F16 యుద్ధ విమానాల విడిభాగాలు, టాటా-లాకీల సంయుక్త భాగస్వామ్యంలో తయారవుతున్నాయని చెప్పారు. మానవీయ సాయం అందించడంలో, విపత్తు స్పందనలో భారత రక్షణ దళాలకు మంచి అనుభవం ఉందని ఇండియన్ నేవీ అధికారి సూరజ్ బెర్రీ తెలిపారు. భారత్-అమెరికా సంబంధాల బలోపేతంలో భాగంగా డిసెంబర్ 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో, ఫిబ్రవరిలో లక్నోలో వాణిజ్య సదస్సులు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story