తాజా వార్తలు

విధులను బహిష్కరించిన నిమ్స్ నర్సులు

విధులను బహిష్కరించిన నిమ్స్ నర్సులు
X

nurs

హైదరాబాద్‌ నిమ్స్‌లో నర్సులు ఆందోళనకు దిగారు. ప్రమోషన్ల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ వారు నిరసన తెలిపారు. గురువారం ఇదే విషయంతో మనస్తాపం చెంది నిర్మల అనే నర్సు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నేపథ్యంలో.. తమకు న్యాయం చేయాలంటూ వారు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం విధులను బహిష్కరించి నిమ్స్‌ డైరెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే.. మెడికల్ సూపరింటెండెంట్‌ను కూడా తప్పించాలని కోరుతున్నారు. వాళ్లు తమను చిన్న చూపు చూస్తున్నారని నర్సులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story

RELATED STORIES