తాజా వార్తలు

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ
X

telangana-bhavan

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం జరగనుంది. తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ పార్లమెంటరీ పక్షనేత కే.కేశవరావు అధ్యక్షత వహిస్తారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు హజరయ్యే ఈ సమావేశంలో.. ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్ధేశం చేస్తారు.

పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. శుక్రవారం మాత్రం తొలిసారిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. ముందుగా కేసీఆర్‌ పాల్గొంటారని అనుకున్నా.. తర్వాత కేటీఆర్‌ అధ్యక్షత వహిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాల కోసం ఈ సారి కేంద్రాన్ని గట్టిగా కోరే అంశంపై టీఆర్‌ఎస్‌పీపీ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి.

Next Story

RELATED STORIES