చీరల కోసం షాప్‌కి వెళ్లి పట్టుచీరలతో జంప్

చీరల కోసం షాప్‌కి వెళ్లి పట్టుచీరలతో జంప్
X

arrest

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో లేడీ దొంగలు రెచ్చిపోయారు. చీరల కొనుగోలు కోసమంటూ షాప్‌లోకి వచ్చి చాకచక్యంగా పట్టుచీరలతో ఉడాయించారు. అనుమానం వచ్చిన షాప్‌ యజమాని సీసీ ఫుటేజీని పరిశీలించడంతో దొంగతనం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరో షాప్‌లో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా ముగ్గురు మహిళలతోపాటు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితులు జనగాం జిల్లా దుబ్బతండాకు చెందిన వారిగా గుర్తించారు.

Tags

Next Story