ప్రేమ విఫలమైందని ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
X

crime

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమై ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాష్‌రావు అనే విద్యార్థి.. హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఓ మైనర్ బాలికను ప్రకాష్‌ ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు ప్రకాష్‌ను బెదిరించారు. పేరెంట్స్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్‌ మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Next Story

RELATED STORIES