ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు

tstc

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు JAC నేతలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. JAC ముఖ్య నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. BNరెడ్డి నగర్‌లో అశ్వత్థామరెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

ఎంప్లాయిస్ యూనియన్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బస్‌ భవన్‌ దగ్గర, ప్రతి డిపో దగ్గర 500 మీటర్ల వరకు 144 సెక్షన్‌ విధించారు. గుంపులుగా వచ్చి ఆందోళన చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story