సాయం చేసిన భార్యభర్తలకు సైనైడ్‌ కలిపిన మద్యాన్ని తాగించి హత్య

సాయం చేసిన భార్యభర్తలకు సైనైడ్‌ కలిపిన మద్యాన్ని తాగించి హత్య
X

Untitled-1

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. సాయం చేసిన భార్యభర్తలకు సైనైడ్‌ కలిపిన మద్యాన్ని తాగించి హత్య చేశాడో దుర్మార్గుడు. పెన్‌ పెహాడ్‌ మండలం మొరసకుంట తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

మొరసకుంటతండాకు చెందిన మూడ్‌లాల్‌ సింగ్‌ పేరు మీద.. స్థానికుడైన పల్లపు దుర్గయ్య హైదరాబాద్‌లోని ఓ ఫైనాన్స్‌ సంస్థ నుంచి ట్రాక్టర్‌ తీసుకున్నాడు. ఇందు కోసం లాల్‌ సింగ్‌కు ఓ లక్ష రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. రెండు వాయిదాలు చెల్లించిన తరువాత దుర్గయ్యకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో లాల్‌ సింగ్‌ను చంపేస్తే ట్రాక్టర్‌ వాయిదాలు ఎగ్గొట్టొచ్చని పక్కా ప్లాన్‌ చేశాడు దుర్గయ్య. ఈ నెల 3న సైనైడ్‌ కలిపిన మద్యాన్ని లాల్‌ సింగ్‌తో పాటు అతని భార్యతో తాగించాడు. దీంతో వారిద్దరు మృతి చెందాడు. ఇద్దరి హత్య చేసిన దుర్గయ్యను నార్కట్‌ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES