సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ యువతులకు హెడ్‌మాస్టర్ ఎర

అతనో ప్రధానోపాధ్యాయుడు! బడి పర్యవేక్షణ, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే బాధ్యతను పక్కనపెట్టి మహిళలకు వల వేస్తాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, కృష్ణానగర్‌లోని మహిళల హాస్టళ్ల చుట్టూ తిరుగుతూ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ యువతులను నమ్మిస్తాడు. కారు, దర్పం ఉట్టిపడే వస్త్రధారణతో వారి ముందు పటాటోపాన్ని ప్రదర్శిస్తాడు! చిత్ర పరిశ్రమలో లైట్‌బాయ్ నుంచి డైరెక్టర్ దాకా తనకు తెలియనివారే లేరని.. వారికి తాను ఎంత చెబితే అంత అని వారితో దిగిన ఫొటోలు చూపిస్తాడు. ఒకసారి తన బుట్టలో పడగానే.. అమ్మాయిల నుంచి డబ్బు, బంగారు నగలు.. ఇలా ఏది దొరికితే అది లాగేసుకుంటాడు. ఆపై వారిని శారీరకంగానూ వాడుకొని ముఖం చాటేస్తాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహారాజ్‌పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న నారాయణ రాజు లీలలివి.
ఇలా ఏళ్లుగా ఎంతోమంది అమాయక యువతులను మోసం చేశాడు నారాయణ రాజు. ఇతడిపై ఏడాది క్రితమే తెలంగాణ, ఏపీలో పలువురు బాధితులు పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే.. తనపై ఎవరు ఫిర్యాదు చేసినా.. విచారణ జరగకుండా వారిని మేనేజ్ చేయడం ఇతగాడి స్టయిల్. నెల్లూరు యువతిని ఇదే రీతిలో మోసం చేశాడు. అరెస్టు చేసి, తన నుంచి తీసుకున్న డబ్బును ఇప్పించాలని వేడుకొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com