తాజా వార్తలు

పెళ్లై 20 ఏళ్లు.. ప్రేమించిన ప్రియుడిపై మనసై..

పెళ్లై 20 ఏళ్లు.. ప్రేమించిన ప్రియుడిపై మనసై..
X

lovers

టీనేజ్‌కి వచ్చిన ఇద్దరు పిల్లలు. అడ్డదారులు తొక్కే వయసు. అమ్మానాన్నలు బిడ్డల్ని కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ, మంచి చెడు వివరిస్తూ సరైన నిర్ణయాలు తీసుకునేలా పిల్లల భవిష్యత్తుని తీర్చి దిద్దుతారు. అలాంటి సమయంలో అమ్మే పక్కదారి పట్టి ప్రేమించిన ప్రియుడి కోసం అప్పటి వరకు వారితో కొనసాగించిన అనుబంధాన్ని తృణప్రాయంగా తీసివేస్తూ తనదారి తాను చూసుకుంటానంటోంది. హైదరాబాద్ కృష్ణనగర్‌లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి.అశోక్‌లు 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.. 18 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురు ఉన్నారు. 2016లో వారి

ముచ్చటైన సంసారంలోకి మరో వ్యక్తి వచ్చాడు. ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాలరావుతో 2016నుంచి జ్యోతీశ్వరి ప్రేమలో పడింది. ఈ విషయం అశోక్‌కి తెలిసి భార్యని మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు. విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రేమించిన ప్రియుడికోసం భర్తని, పిల్లలను కాదని జ్యోతీశ్వరి కోర్టుకు ఎక్కింది. విడాకులు రాకముందే భార్య, వేణుగోపాల్‌తో కలిసి ఉంటూ, పెళ్లి చేసుకున్నామని ఇద్దరూ కలిసి బ్యాంకులో లోన్ తీసుకున్నట్లు అశోక్ తెలుసుకున్నారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించారు అశోక్. ఈ మేరకు జ్యోతీశ్వరి మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES