మీర్‌పేట్ కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

మీర్‌పేట్ కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
X

arrest

ఆదివారం హైదరాబాద్ మీర్ పేట్ లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. 7 ఏళ్ల బాలుడు అర్జున్ ను కిడ్నాప్ చేసిన దుండగుడు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. 25 వేల నగదు.. 2లక్షల 75వేల చెక్ ఇవ్వాలని బెదిరించాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ కాల్ ఆధారంగా ట్రేస్ చేసి నిందితుడు 17 ఏళ్ల శివ చరణ్ ను పట్టుకున్నారు పోలీసులు. విచారణలో గతంలో పక్కింట్లో లక్ష రూపాయలు కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు శివచరణ్ ను జువైనల్ హోమ్ కు తరలించారు పోలీసులు.

Next Story

RELATED STORIES