మైనర్‌ను గర్భవతిని చేసి పారిపోయిన కామాంధుడు

మైనర్‌ను గర్భవతిని చేసి పారిపోయిన కామాంధుడు
X

minor-girl

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడ్డ కామాంధుల్లో మార్పు రావడంతో లేదు. మైనర్‌ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డ రాజు అనే వ్యక్తి.. బాలిక గర్భవతి అని తెలియడంతో పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం మాలపాడులో జరిగి ఈ దారుణం.. జిల్లా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

మాలపాడు గ్రామానికి చెందిన రాంబాబు, లక్ష్మీ దంపతులు.. అదే గ్రామంలో వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. పెద్ద కూతురికి వివాహం జరగగా.. చిన్న కూతురు ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. అయితే బాలిక ప్రతిరోజు ఇంటి పక్కనే ఉన్న దుర్గ అనే మహిళ ఇంట్లో టీవీ చూడ్డానికి వెళ్లేది. దీంతో ఇదే అదనుగా భావించిన దుర్గకు అన్న వరుస అయిన పాలిక రాజు.. బాలికపై మామమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆర్థికంగా ఆదుకుంటానంటూ పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతే కాదు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ఎవరికైనా చెబితే వీడియోలు నెట్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. అయితే బాధితురాలు గర్భవతి అని తేలడంతో.. నిందితుడు హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో న్యాయం కోసం కలెక్టర్‌కి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. నిందితునికి ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Next Story

RELATED STORIES