ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం: హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం: హైకోర్టు

hi

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఆర్టీసీ సమ్మెపై తామెలాంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని.. ఆ పరిధి దాటి ముందుకెళ్లలేమని కోర్టు వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని లేబర్‌ కమిషనర్‌ను ఆదేశిస్తామని.. రెండు వారాల్లోగా సమస్య పరిష్కరించాలని కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు సూచించింది.

సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పేసింది. ఇక సమ్మె విషయాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం సమ్మె కారణంగా జంటనగరాల్లో బస్సులు లేకపోయినా.. ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారని.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story