పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. టైటిల్..

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. టైటిల్..

pawan

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ వార్త కన్ఫార్మ్ అయింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ తో పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఇంతకు మించిన వార్తలు రాలేదు. బట్ ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. కథ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. అంతే కాదు.. ఈ మూవీ టైటిల్ చెప్పబోతున్నారు. మరి ఆ టైటిల్ ఏంటో తెలుసా..? లాయర్ సాబ్.

లేదు లేదంటూనే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. ఎటొచ్చీ ఇంకా దర్శకుడు తేలలేదు కానీ.. చాలా విషయాలే జరుగుతున్నాయి. ఇప్పటికైతే టైటిల్ గా లాయర్ సాబ్ ను చెబుతున్నారు. సినిమాలో అత్యంత కీలకంగా కనిపించే పాత్రల కోసం పూజా హెగ్డేను కూడా సంప్రదించారు. గతంలో బోనీ కపూర్ తనను కలిసింది ఇందుకే. అంటే బాలీవుడ్ లో తాప్సీ, తమిళ్ లో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్ర కోసం పూజాను తీసుకోవాలనుకుంటున్నారు. తన సైడ్ నుంచి ఇంకా అంగీకారం రాలేదు. ఇక సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ ఇద్దరూ ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారు. సినిమా ప్రారంభోత్సవం రోజున లాయర్ సాబ్ ను కూడా అనౌన్స్ చేయాలనుకుటున్నారు. మరో విషయం ఏంటంటే.. సినిమాను రికార్డ్ టైమ్ లో పూర్తి చేస్తారట.

సినిమాలో కీలకంగా ఉండే కోర్ట్ సెట్ ను వచ్చే డిసెంబర్ నుంచి అన్నపూర్ణ సెట్ లో వేయబోతున్నారు. జనవరిలో సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభించి కేవలం నెలా లేదా రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. సమ్మర్ బరిలో మే నెలలో విడుదల చేస్తారట. దిల్ రాజు ప్లానింగ్ పక్కాగా ఉటుంది కాబట్టి.. ఒక్కసారి పవన్ షూటింగ్ లో జాయిన్ అయితే ఇక అన్నీ అనుకున్నట్టే జరిగిపోతాయంటున్నారు. ఏదేమైనా లాయర్ సాబ్ అనే టైటిల్ వపన్‌కు సూట్ అవుతుందా అని ఒకవైపు, పర్ఫెక్ట్ గా ఉంటుందని మరోవైపు ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయి. అన్నీ ఓకే కానీ అసలీ లాయర్ సాబ్ ను హ్యాండిల్ చేసే ‘కెప్టెన్ సాబ్’ను కూడా తేల్చేస్తే ఓ పనైపోతుంది కదా..?

Tags

Read MoreRead Less
Next Story