అవును.. అమ్మనవుతున్నా.. డెలివరీ డేట్!!

ఓ బేబీ బ్యూటీ.. బేబీకి జన్మనిస్తుందా.. ఎంతైనా మోస్ట్ పాపులర్ హీరోయిన్ కదా.. మరి ఆ మాత్రం ఆసక్తి ఉండదా.. అమ్మ అవుతుందంటే సంతోషంతో ఓ వార్త రాసేయొద్దు. అక్కినేని ఇంటి వారి కోడలైన సమంతను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. తను ఈ మధ్య పోషించే ప్రతి పాత్రా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. పెళ్లయిందాకా ఓ గోల.. పెళ్లయిన తరువాత పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని మరో గోల.
దాన్ని భరించలేక ఎట్టకేలకు.. అవునండి అమ్మనయ్యాను.. 2022 సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున ఉదయం 7 గంటలకు ఓ బిడ్డకు జన్మనిస్తానంటూ చిరు కోపం ప్రదర్శిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్ల నోరు మూయించింది సామ్. ప్రస్తుతం సమంత దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా 96 రీమేక్‌లో నటిస్తోంది. శర్వానంద్ సమంతకు జోడీగా నటిస్తున్నారు. మరో పక్క అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ సమంత బిజీగా ఉంది. ఇంక బేబీ గురించి ఆలోచించడానికి టైమెక్కడిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com