తాజా వార్తలు

ప్రశాంత్ విషయంలో జరిగింది ఇదే..

ప్రశాంత్ విషయంలో జరిగింది ఇదే..
X

prashanth

పేరు ప్రశాంత్.. హైదరాబాద్ కు చెందిన ఇతడు.. బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్న సమయంలో సహోద్యోగితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ ప్రేమ కాస్త ఫెయలవ్వడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో 2017 నుంచి ఇంటికి దూరంగా తల్లి దండ్రులకు కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడే పోలీసులకు ప్రశాంత్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. ప్రశాంత్ జాడ్ తెలియలేదు..

ఈ నెల 14న తెలుగు యువకుడ్ని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారని మీడియాలో వార్త రాడంతో.. ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. విషయం తెలుసుకుని అది తమ కొడుకే అని నిర్ధారించుకున్నారు. అప్పటి నుంచి పాక్‌ చెరలో చిక్కుకున్న తమ కుమారుడ్ని విడిపించాలని భారత విదేశాంగ శాఖ ప్రతినిధుల్ని తండ్రి బాబురావు వేడుకున్నారు. ఢిల్లీ వెళ్లి రాయబార కార్యాలయం ద్వారా పాక్‌తో సంప్రదింపులకు ప్రయత్నించారు. అటు ప్రశాంత్, వారిలాల్ అరెస్టుపై భారత విదేశాంగ శాఖ దృష్టి సారించింది. సరిహద్దులు దాటి ఎలా వెళ్లారనే దానిపై పూర్తి సమాచారం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది.

పాస్‌పోర్టు, వీసా లేకుండా చోలిస్థాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ ప్రకటించింది. సర్దార్‌ యహాజమన్‌ మండి పోలీసు స్టేషన్‌ వద్ద అరెస్టు చేసినట్లు పాక్ పోలీసులు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌ సరిహద్దులకు చేరువలో చోలిస్థాన్‌ ఉంది. ఇతని పై పాకిస్థాన్‌ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ వ్యవహారం భారత్‌, పాక్‌ల మధ్య దౌత్యపరంగా మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది.

తన కొడుకు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదంటున్నారు తండ్రి బాబురావు. ఎలా అయినా తన కొడుకు ప్రశాంత్ క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కోరారు.

2017లో ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ప్రశాంత్ ఎక్కడున్నాడు? మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌తో ప్రశాంత్‌కి పరిచయం ఎలా అయ్యింది..! లాంటి తెలిసిన ప్రాథమిక సమాచారాన్ని తెలంగాణ పోలీసులు కేంద్ర హోంశాఖకు పంపనున్నారు. ప్రశాంత్ మెయిల్‌ ఐడీ, పాత ఫోన్ నంబర్ల ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES