తాజా వార్తలు

బాలాపూర్‌ పీఎస్‌ ఎదుట ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

బాలాపూర్‌ పీఎస్‌ ఎదుట ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం
X

asi

బాలాపూర్‌ పీఎస్‌ ఎదుట ఏఎస్‌ఐ నరసింహ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ఏఎస్‌ఐ నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను హుటాహుటిన డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. నరసింహ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నరసింహ ప్రస్తుతం మంచాల పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. అయితే. గతంలో బాలపూర్‌ పీఎస్‌లో పనిచేసిన నరసింహ.. అక్కడి సీఐ సైదులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటినుంచి తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నాడు నరసింహ. అందుకే అన్యాయంగా బదిలీ చేశారంటున్నాడు నరసింహ.

Next Story

RELATED STORIES