జార్జిరెడ్డి మూవీ రివ్యూ.. ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న మేథావి కథ..

జార్జిరెడ్డి మూవీ రివ్యూ.. ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న మేథావి కథ..

george-reddy-movie--review

విడుదల తేదీ : నవంబర్ 22, 2019

నటీనటులు : సందీప్ మాధవ్, సత్య దేవ్, దేవిక, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, తదితరులు.

దర్శకత్వం : జీవన్ రెడ్డి

నిర్మాత‌లు : అప్పిరెడ్డి, దామోదర రెడ్డి ,సంజయ్ రెడ్డి.

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫర్ : సుధాకర్ యెక్కంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్- అర్జిత్ దత్త.

ఎడిటర్: ప్రతాప్ కుమార్

ఉస్మానియా చరిత్రలో జార్జిరెడ్డి ఒక నెత్తుటి సంతకం. విద్యార్థి నేతగా, మేథావిగా జార్జి ప్రభావం చాలామంది విద్యార్ధులమీద ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉంది. రెండు విభిన్నమైన అంశాలలో జార్జిరెడ్డి చూపించిన ప్రతిభ అనన్యసామాన్యమైనది. అటువంటి విద్యార్థి నాయకుడి చరిత్ర వెండితెరమీదకు వస్తుందంటే సహాజంగానే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని పదింతలు చేసింది చిత్ర యూనిట్. మరి ఆ రియల్ లైప్ హీరో జార్జిరెడ్డి రీల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడా ఇప్పుడు చూద్దాం..

కథ :

జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) తన చిన్నతనం నుండి అన్యాయం పై ఎదురు తిరిగే మనస్థత్వం ఉన్న వ్యక్తి. తన ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉండడు.. అదే అతన్ని చాలా మందికి దగ్గర చేస్తుంది, శత్రువును చేస్తంది. ఉస్మానియాలో మాస్టర్స్ చేసేందుకు వచ్చిన జార్జి అక్కడ కుల వివిక్ష, మత రాజకీయాలపై ఎదురు తిరుగుతాడు. హాస్టల్స్ నుండి స్కాలర్ షిప్ ల వరకూ జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తాడు..? ఒక లీడర్ గా, అణగద్రొక్క పడుతున్న వారకి అండగా మారతాడు..? ఒక పక్క గోల్డ్ మెడల్ సాధిస్తూనే మరో పక్క విద్యార్థి నేతగా మారతాడు..? మరి అతని ఎదుర్కోలేని కొన్ని సంఘ విద్రోహాక శక్తులు జార్జిని అంతమొందించేందుకు కుట్ర పన్నుతాయి..? మరి జార్జి కథ ఎలా ముగుస్తుంది..? ఏమి మిగులుస్తుంది..?

కథనం:

సమాజంలో ఏం జరుగుతందో నీకెందుకు నీ పని నువ్వు చూసుకో, నీ చదువు నువ్వు చదువుకో. ఏ ఇంట్లో అయినా వినపడే మాటలు.. కానీ జార్జి తల్లి తనకు అలా చెప్పదు. భగత్ సింగ్ కథలతో కొడుకు లోని వ్యక్తిత్వాన్ని పదును పెడుతుంది. ఈ కథలో జార్జి విప్లవ పంథాకు బాటలు వేసిన బాల్యాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు జీవన్ . జార్జి పాత్ర లోని భిన్నమైన లక్షణాలు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని చూడటమే ఆశ్చర్యంగా ఉండకమానదు. మేథస్సు, మానవత్వం, నాయకత్వం కలగలపిని అరుదైన వ్యక్తిత్వానికి మనిషి రూపం చూస్తుంటే ఆరాధించకుండా ఉండలేం. ఆ పాత్రకు నిండుదనం తెచ్చాడు సందీప్. బాడీ లాంగ్వేజ్ నుండి మాట తీరు వరకూ జార్జి పాత్ర లోని చాలా సులభంగా ప్రవేశించాడు. అతని లక్షణాలు కలిగించే ఆరాధన భావంలో పడిన హీరోయిన్ పాత్ర తాలూకు ప్రేమను సింగిల్ సైడ్ గానే ఉంచాడు దర్శకుడు. ఇక జార్జి పాత్రకోసం హీరోయిజం కల్పించక్కర్లేదు. అతని స్వభాంలోనే హీరోయిజం ప్రతిబింబిస్తుంది. అందుకే ఆ పాత్రను చాలా వరకూ రియలిస్టిక్ గా ఉంచేందుకు ప్రయత్నించాడు. పెళ్ళి చూపులతో కమెడియన్ గా పరిచయం అయిన అభయ్ ఇందులో మంచి నటుడిగా పరిచయం అయ్యాడు. రాజన్న పాత్రలో జీవించాడు. సత్యదేవ్, ముస్కాన్, మనోజ్ నందన్ కొత్త వాడు అయిన తిరు నటన చాలా బాగుంది. తిరు నటన కొన్ని సన్నివేశాల్లో హైలెట్ గా నిలిచింది. విద్యార్ధి ఎలా ఉండాలి..? సమాజం పట్ల ఎంత భాద్యతతో ఉండాలి..? అన్యాయాన్ని ఎదిరించడానికి ఆలోచించని తత్వంలో నిండిని జార్జిరెడ్డి తెరమీద కూడా అంతే హీరోయిక్ గా కనిపించాడు. అప్పటి సామాజిక పరిస్థితులు, వేష బాషలు, ఉస్మానియి క్యాంపస్ ని రీ క్రియేట్ చేయడంలో దర్శకుడు జీవన్ రెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌైండ్ స్కోర్ చాలా బాగుంది. అడుగు అడుగు పాటతో జార్జి ఆశయాలను తెరమీద బాగా ఆవిష్కరించాడు దర్శకడు. సినిమా టిక్ లిబర్టీ కంటే పాత్రలోని సహాజత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు జీవన్ రెడ్డి. అందుకే ఎక్కవు బిల్డప్ షాట్స్ కంటే విద్యార్ధుల మద్య సంఘర్షణలు వాస్తవికతకు దగ్గరగా కనిపిస్తాయి. జార్జి ఎటాక్ చేసిన ఫైర్ బాల్ ఫైట్, వర్షంలో బ్లేడ్ ఫైట్ వంటిని కమర్షియల్ గా టాప్ నాచ్ లో కనిపించాయి.

లోకల్ నాన్ లోకల్ అనే వైషమ్యాలు మనిషికి మనిషిని శత్రువుగా చేస్తాయి. ఆ విద్వేషానికి బలైన మేథావి జార్జిరెడ్డి. దేశం గతిని మార్చే మేథస్సు కలిగిన వ్యక్తిని ఆ పగలే పొట్టన బెట్టుకున్నాయి. జార్జి మర్డర్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఆ ఎపిసోడ్ కి ముందు దర్శకుడు ఆడియన్స్ ని ప్రిపేర్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. ఆయుధం అందుబాటులో ఉన్నా కూడా దాని జోలికి వెళ్ళడు. ఆత్మ రక్షణ కోసం తప్ప దాడికి దిగడు.. హింసతో కాదు చదువుతో సమాజం మారుతుంది అని నమ్మిన మేథావి. స్వేచ్ఛగా బ్రతకడం అనేది అందరి హాక్కు అది ఏ ఒక్కరి దయ కాదు అని ఎలిగెత్తి చెప్పిన నాయకుడు. మన దేశం శత్రు దేశాలు చేసిన దాడులలో చాలా విలువువైన వాటిని కొల్పోయింది అని చరిత్ర చెబుతుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అంతకంటే విలువైన వ్యక్తులను సొంత వారి కుట్రలతో కోల్పోయింది అనిపించింది.

జీవన్ రెడ్డి వెండితెర మీద చెప్పిన జార్జిరెడ్డి కథ ఎప్పటికీ ఒక ఉత్తేజ పూరితమైన కథగా గుర్తుండిపోతుంది. పుస్తకాలలో కొందరి స్మృతులలో మిగిలిన జార్జిరెడ్డికి ఈ చిత్ర బృందం నిజమైన నివాళిని అర్పించింది. వెండితెరమీద గుర్తిండిపోయే కథ.

చివరిగా:

ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు ఉద్వేగంతో మనసు నిండుతుంది. స్వార్ధం అనే మాటకు జీవితంలో చోటు ఇవ్వని ఈ మేథావి కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.

-కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story