మహిళ కడుపులో మాప్‌ను పెట్టి కుట్లు వేసిన వైద్యురాలు

వైద్యురాలి నిర్లక్ష్యంతో.. ఓ మహిళ నాలుగేళ్లుగా నరకయాతన అనుభవించింది. శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు ఆ మహిళ కడుపులో బట్ట మరిచిపోవడంతో చాలా అవస్థలు పడింది. మరో డాక్టర్ గుర్తించి ఆ బట్టను బయటకు తీయడంతో విషయం బయటపడింది. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జగ్గయ్యపేట గ్రామానికి చెందిన రమాదేవికి ప్రసవం కోసం శస్త్ర చికిత్స చేసిన వైద్యురాలు.. తరువాత పొరపాటున మాప్‌ను లోపలపెట్టి కుట్లు వేసేసింది. ఆ విషయం తెలియని మహిళ అప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ వస్తోంది. నాలుగుళ్లుగా డాక్టర్లు చుట్టూ తిరిగినా సమస్య ఏంటో ఎవరూ గుర్తించలేదు. వారం కిందట మరో వైద్యుడికి అనుమానం రావడంతో.. మరో శస్త్రచికిత్స చేసి లోపల బట్టను బయటకు తీశాడు.
వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా తన భార్య నాలుగేళ్ల పాటు నరకయాతన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశాడు భర్త పెంటయ్య.. ఈ నాలుగేళ్లు వైద్యం కోసం 5 లక్షల రూపాయల దాకా ఖర్చైందని ఆరోపించాడు. కడుపులో బట్ట కారణంగా అనేకసార్లు అబార్షన్ కూడా అయ్యింది. అందుకు కారణమైన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు పెంటయ్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com