వ్యక్తి మూత్రం తాగి.. విమానంలో వైద్యుడు..

వ్యక్తి మూత్రం తాగి.. విమానంలో వైద్యుడు..

china-doctor

ఆలోచించడానికి టైమ్ లేదు.. వైద్యుడిగా మరో ఆలోచన లేకుండా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే అతడి ముందున్న కర్తవ్యం. విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ తోటి ప్రయాణికుడి ఇబ్బందిని గమనించారు. చైనా జువాంగ్‌జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్‌కు బయలుదేరింది. మరో 6 గంటల్లో న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం లాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈలోపు 70 ఏళ్ల ఓ వ్యక్తి పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. బాధ భరించరానిదిగా ఉంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ జాంగ్ హాంగ్ తోటి ప్రయాణికుడి పరిస్థితిని గమనించారు. ఆయన ప్రోస్టేట్ గ్రంధి వ్యాకోచంతో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. మూత్రాశయం నుంచి తరచుగా మూత్రాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుందని లేకపోతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గుర్తించారు. మరో ఆలోచన లేకుండా పేషెంట్ మూత్ర ద్వారానికి డాక్టర్ ఓ ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బయటకు పీల్చారు. అలా పీల్చిన మూత్రాన్ని ఓ ఖాళీ వైన్ బాటిల్‌లో పోస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేసి అతడిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.

Read MoreRead Less
Next Story