ఎగురుతున్న విమానంలో ఎగిసిపడే మంటలు.. 347 మంది ప్రయాణికులు..

ఎగురుతున్న విమానంలో ఎగిసిపడే మంటలు.. 347 మంది ప్రయాణికులు..

flight

గాల్లో విమానం ఎగురుతుంటే ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లు అనిపిస్తుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్లో నుంచి మంటలు వస్తున్నాయని తెలిస్తే.. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవలసిందే.. కానీ అదృష్టం బావుండి అందులో ప్రయాణిస్తున్న 347 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎయిర్‌లైన్స్ విమానం లాస్ ఏంజెల్స్ నుంచి ఫిలిఫ్పీన్స్‌కు బయలుదేరింది. అందులో 347 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు అత్యవసర ల్యాండింగ్‌ పేరిట విమానాన్ని కిందకు దించడంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయట పడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం 113 బోయింగ్-777 రకానికి చెందినదని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. విమానానికి మంటలు అంటుకున్న విషయం గుర్తించిన పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించి సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Read MoreRead Less
Next Story