తాజా వార్తలు

చిన్నారిని అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు

చిన్నారిని అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
X

bidda

ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని సంబరిపడిపోయే వాళ్లున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మకం వస్తువులుగానే మిగిలిపోతున్నారు. ఆడశిశువుల హత్యలు, చెత్తబుట్టలు, ముళ్లపొదళ్లో విడిచివెళ్లిపోయే ఘటనలు ఇప్పటికీ మనలోని రాతి మనుషులను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇక కొడుకు కోసమే పిల్లల్ని కనే తల్లిదండ్రుల అరాచకాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆడశిశులను రక్షించేందుకు భేటీ బచావో..భేటీ పడావో, కళ్యాణ లక్ష్మీ లాంటి ఎన్నో పథకాలు అమలు చేసినా..ఆడపిల్లల వివక్ష పోవటం లేదు. ఇందుకు ఈ తల్లిదండ్రులే సాక్ష్యం.

ఆజ్మీరా తండా. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఉంది. ఇక్కడి పరిసరాలు గమనిస్తే ఇక్కడివారి వెనకబాటుతనం అర్ధం అవుతుంది. అజ్మీరా తండాకు చెందిన శరత్, పద్మకు ఏడేళ్ల క్రితమే పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లు. కానీ, ఇంటికి వారసుడు ఉండి తీరాల్సిందే అనే మూర్ఖత్వంలో మూడోసారి కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ జంట. ఆడబిడ్డ పుట్టడం మింగుడు పడని గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని అమ్మకానికి పెట్టేశారు. అయితే.. అమ్మగారి ఇంటి నుంచి బిడ్డ లేకుండా వచ్చిన పద్మ తీరు చూసి ఊరి జనానికి అనుమానం వచ్చింది. బాలల హక్కుల సంఘం, చైల్డ్ లైఫ్ సంస్థలకు సమాచారం ఆందించారు.

గ్రామస్తులతో విషయం తెలసుకున్న అధికారులు పద్మ, శరత్ జంటను ఆరా తీసింది. దీంతో విషయం బయటపడింది. సాకలేక తమ బంధువులకు ఇచ్చామని చెబుతున్నారు. త్వరలోనే చిన్నారి ఎక్కడుందో పట్టుకుంటామని నూతనకల్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మాచారం తండాకు చెందిన సరోజ, సతీష్ లకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారసుడు ఉండి తీరాల్సిందేననే ప్రయత్నంలో మూడో సంతానానికి జన్మనిచ్చారు. కానీ, ఆడపిల్ల పుట్టడంతో 3 నెలల తర్వాత సరోజకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ చిన్నారిని విక్రయించేశారు. కొన్నాళ్ల తర్వాత విషయం బయటపడటంతో విచారణ ప్రారంభమైంది. పేదరికంతో పిల్లను సాకలేక తమ బంధువులకు ఇచ్చామని పోలీసుల ఎంక్వైరీలో సరోజ చెబుతోంది.

పేదరికంతో ఆడపిల్లలను పోషించలేక బంధువులకు ఇచ్చినట్లు చెబుతున్నా..దీనివెనక దళారివ్యవస్థ పనిచేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తండ ప్రాంతాల్లోని అమాయక గిరిజనులకు ఆశలు కలిపించటం..గుట్టుచప్పుడు కూడా ఆడశిశువులను అమ్ముతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story

RELATED STORIES