తాజా వార్తలు

బ్రోకింగ్ సంస్థ కార్వీపై సెబీ నిషేధం.. 2 వేల కోట్ల..

బ్రోకింగ్ సంస్థ కార్వీపై సెబీ నిషేధం.. 2 వేల కోట్ల..
X

sebi

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్రోకింగ్ సంస్థ కార్వీపై సెబీ నిషేధం విధించింది. సుమారు 2 వేల కోట్ల చెల్లింపులు డిఫాల్ట్ అయినందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. సెబీ మధ్యంతర ఉత్తర్వు ప్రకారం ఇకపై కంపెనీ కొత్త క్లైంట్లను కూడా తీసుకోకూడదు. అదే సమయంలో క్లైంట్ల తరఫు ట్రేడింగ్ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయింది.

తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జరిపిన తనిఖీల్లో అనేక విస్తుపోయే అంశాలు బయటపడ్టాయి. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 మధ్య తమ గ్రూపు సంస్థల్లో ఒకటైన కార్వీ రియాల్టీకి 1096 కోట్లు అక్రమంగా బదలాయించింది. ఇదే సమయంలో క్లైంట్లకు చెందిన తనఖా షేర్లను కూడా ఆఫ్ మార్కెట్ ట్రాన్స్‌ఫర్ వాళ్లకు తెలియకుండా బదలాయించింది. వీటి విలువ 228.07 కోట్లు. 156 మంది క్లైంట్ల నుంచి రూ.27.8 కోట్ల విలువైన షేర్లను తెలియకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకుంది. ట్రేడింగ్ చేయని అకౌంట్ల నుంచి 116.3 కోట్ల విలువైన షేర్లను 291 మంది క్లైంట్ల నుంచి కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ బదలాయించుకున్నట్టు ఎన్ఎస్ఈ అధ్యయనంలో బయటపడింది. అంతే కాకుండా తన డిపి అకౌంట్‌లో లేని స్టాక్స్‌ను అమ్మింది. వీటి విలువ రూ.485 కోట్లు. ఇలా అనేక అవకతవకలకు పాల్పడిన నేపధ్యంలో కార్వీపై సెబీ నిషేధం విధించింది.

గత కొద్ది రోజులుగా కార్వీ సంస్థ నుంచి పే అవుట్స్ రావడం లేదంటూ అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే విషయాన్ని వారు ఫైనాన్స్ మినిస్ట్రీ, పీఎంఓ, సెబీలకు కూడా ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి

Next Story

RELATED STORIES