బేబీ కావాలంటే బెస్ట్ ఫుడ్ ఇదే..

స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ దానిమ్మను జ్యూస్‌గా గాని, గింజల రూపంలో గానీ తీసుకుంటే సంతాన సమస్యలను నివారిస్తుంది. మహిళల గర్భాశయంలో రక్తప్రసరణను పెంచుతుంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. పాలు, పదార్థాలు కూడా సంతాన సమస్యలను దూరం చేస్తాయి. పాలలోని విటమిన్లు స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి.
ఖర్జూరాల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ త్వరగా గర్భం దాల్చేందుకు తోడ్పడతాయని పలురకాల అధ్యయనాల్లో తేలింది. మహిళల్లో ప్రత్యుత్పత్తిని వేగవంతం చేయడంలో సిట్రస్ ప్రూట్స్ పాత్ర కూడా ప్రముఖమైనది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి ద్వారా త్వరగా తల్లిదండ్రులయ్యే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్లు. కనుక ప్రతి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు సరైన జీవన విధానం అలవరచుకుంటే సంతాన సమస్యలను దూరమవుతాయి. పాపాయి కేరింతలు ప్రతి ఇంటా వినిపిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com