ఆర్టీసీ సమ్మె.. ఇక సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు

ఆర్టీసీ సమ్మె.. ఇక సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు

TSRTC

ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మెకు దిగిన ఆర్టీసీ జేఏసీ.. ఇప్పుడు సేవ్ ఆర్టీసీ పేరుతో తమ ఆందోళన కొనసాగిస్తోంది. నిజానికి 47 రోజుల నిరసనల తర్వాత సమ్మెను విరిమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. కార్మికులను బేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరింది. అయితే..హైకోర్టు తుది నిర్ణయం తర్వాత ప్రభుత్వం తాడో పేడో తేల్చేస్తుందని భావించారంతా. కానీ, ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకపోవటంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు ఉద్యమ కార్యచరణ ప్రకటిచింది ఆర్టీసీ జేఏసీ. దీంతో ఆర్టీసీ సమ్మె నేటితో 52 వ రోజుకు చేరుకుంది.

విధుల్లో చేరతామన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. జేఏసీ పిలుపు మేరకు డిపోల ముందు మానవహారాలు, ఎంజీబీఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టారు కార్మికులు. ఇందులో భాగంగా.. MGBSలో మహిళా ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలనంటున్నారు ఉద్యోగులు. ఆదివారం డిపోల ముందు మానవహారాలు చేపట్టారు ఆర్టీసీ కార్మికులు.

మరోవైపు ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు తమ పోరాటం ఆగదని అన్నారు అశ్వాత్థామరెడ్డి. నిరసన కొనసాగింపులో భాగంగా ఆర్టీసీ డిపోల ముందు, బస్టాండ్ ప్రాంగణంలో సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.

దాదాపు రెండు నెలలుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు చేదోడుగా నిలిచింది టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం. టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో బీద కార్మికులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం కార్మికులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. బద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కార్మికులను నివాళులు అర్పించారు కార్మికులు. వెంటనే కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలంటూ మానవహారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో కొత్త కొలువులు వస్తాయనుకుంటే ఉన్న కొలువులు తీసేస్తారా అంటూ ప్రశ్నించారు జేఏసీ.

Tags

Read MoreRead Less
Next Story