సవతి తల్లి కర్కశం.. చిన్నారిని హత్య చేసి..

సవతి తల్లి  కర్కశం.. చిన్నారిని హత్య చేసి..
X

kidnap

అమ్మ తర్వాత అమ్మలాంటిది.. కన్నతల్లి లేని లోటు తెలియకుండా పెంచాల్సిన పిన్ని రాక్షసిగా మారింది. ఏడేళ్ల చిన్నారిని కర్కషంగా చంపేసింది. ఆ తర్వాత ఏమి తెలియనట్టు కిడ్నాప్ డ్రామా ఆడింది. కానీ, చేసిన పాపం ఆమెను వెంటాడింది. కూతుర్ని చంపిన సవతి తల్లి తాను చేసిన నేరం ఒప్పుకోవటంతో కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది.

ఏడేళ్ల దీప్తిశ్రీ రెండో తరగతి చదువుతోంది. టిక్ టాక్ లో టాలెంట్ ప్రదర్శించే ఆ చిన్నారి చురుగ్గా ఉంటుంది. మూడేళ్ల క్రితమే దీప్తిశ్రీ తల్లి చనిపోయింది. అమ్మ ప్రేమకు దూరమైన పాప.. సవతి తల్లిలో అమ్మ ప్రేమను వెతుక్కుంది.

మూడ్రోజుల క్రితం పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. దీప్తి శ్రీ కిడ్నాప్ కేసు కాకినాడలో కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు సవతి తల్లి శాంతకుమారి ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులకు కిడ్నాప్ కేసు చిక్కుముడిలా మారింది. 48 గంటలైనా చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో కిడ్నాపర్లు ఎవరై ఉంటారో అంతుచిక్కలేదు పోలీసులకు. కానీ, పోలీసుల అనుమానం ఇంటి మనుషుల మీదకే మళ్లింది.

పోలీసుల డౌటుకు తగినట్లుగానే.. తమ చిన్నారిని అపహరించింది సవతి తల్లి శాంతి కుమారే అంటూ దీప్తిశ్రీ నాయయన్మ ఫిర్యాదు చేయడంతో సవతి తల్లి కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చింది. అప్పటికే సవతి తల్లి శాంతి కుమారి మీద అనుమానంతో ఉన్న పోలీసులు..విచారణను మరింత ముమ్మరం చేశారు. స్కూల్‌ విద్యార్ధులు, వృద్ధాశ్రమంలో ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. ఆ తరువాత దీప్తిశ్రీని శాంతికుమారి తీసుకెళ్లినట్లు జగన్నాథపురం నేతాజీ మున్సిపల్‌ స్కూల్ విద్యార్ధులు గుర్తు పట్టారు. చిన్నారి శాంతి కుమారి తీసుకెళ్తున్నట్లు సీసీ ఫూటేజ్ లోనూ రికార్డైంది. దీంతో సవతి తల్లే పాపని అపహరించిందని నిర్ధారించారు పోలీసులు. దీంతో ఆమెను విచారించడంతో నేరాన్ని ఆంగీకరించింది. దీప్తిశ్రీని గొంతు నులిమి చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు.

దీప్తి శ్రీని హత్య చేసింది సవతి తల్లే అని తెలిసినా.. ఇప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. ఆమె ఇచ్చిన సమాచారంతో ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు దీప్తిశ్రీని సవతి తల్లి ఎందుకు కిడ్నాప్ చేసింది.. కన్న బిడ్డ కాదనే కారణంతోనే హాత్య చేసిందా.. లేక అక్రమ సంబంధాలేవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ హత్య కేసులో శాంతికుమారికి ఎవరైనా సహకరించి ఉంటారా అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

Next Story

RELATED STORIES