Top

యూనిఫాంలో టిక్ టాక్ చేయడం చట్ట విరుద్ధం: యూఎస్

చైనా రూపొందించిన యూత్ క్రేజీ యాప్ టిక్ టాక్ ను ఉపయోగించకూడదని అమెరికా రక్షణ శాఖ తమ సిబ్బందికి హెచ్చరికలు జారీచేసింది. ఆర్మీ, నావీ,వాయు రంగాలకు చెందిన సిబ్బంది యూనిఫామ్ లోనే టిక్ టాక్ చేస్తుండటంపై ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భద్రత, రక్షణ సంబంధించిన సమాచారం బహిర్గతం అవుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే యూత్ పాపులర్ అయితే టిక్ టాక్ ను రక్షణ సిబ్బంది ఉపయోగించడం వల్ల ఏర్పడే అనర్ధాలపై చర్చించాలని డెమొక్రటిక్ అభ్యర్ధి సెనెట్ ను కోరడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్నప్పుడు, యూనిఫామ్ వేసుకొని టిక్ టాక్ చేయడం చట్టవిరుద్దమని తేల్చిచెప్పింది.

Next Story

RELATED STORIES