పేకాట ఆడుతున్న 8 మంది మహిళల అరెస్ట్‌

పేకాట ఆడుతున్న 8 మంది మహిళల అరెస్ట్‌
X

women-arrest

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతున్న 8 మంది మహిళల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పట్టాభిరామయ్య కాలనీలోని ఓ ఇంటినే క్లబ్‌గా చేసుకుని పేకాట జోరుగా సాగిస్తున్నట్టు సమాచారం రావడంతో ఖాకీలు నిఘా పెట్టారు. మెరుపుదాడి చేసి పేకాట గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎటాక్‌కి అక్కడ ఉన్న మహిళలు బిత్తరపోయారు. ఎలా తప్పించుకోవాలో తెలియక అడ్డంగా దొరికిపోయారు. ముగ్గురు పురుషులు మాత్రం గోడ దూకేసి జంపైపోయారు. రూ.లక్షా 36 వేలు ఈ 8మంది ఆడాళ్ల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 మొబైల్స్ కూడా సీజ్ చేశారు.

గతంలో మంగళగిరి ప్రాంతంలోనూ ఇలాగే పేక ఆడుతూ మహిళలు పట్టుబడ్డారు. వేలకు వేలు పెట్టి వీళ్లంతా రోజూ రమ్మీ‌ ఆడుతున్నారంటే కొంచెం హైప్రొఫైల్ కుటుంబాల వాళ్లే అయిఉంటారు. మహిళలు కావడంతో వీళ్ల పూర్తి వివరాలు పోలీసులు బయటపెట్టకపోయినా.. కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Next Story

RELATED STORIES