Top

అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య

అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య
X

raut

హైదరాబాద్ కు చెందిన 19ఏళ్ల విద్యార్ధిని అమెరికాలో దారుణహత్యకు గురైంది. నగరానికి చెందిన రూత్ జార్జి అనే యువతి.. యూనివర్షిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో చదువుతోంది. శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన రూత్.. కాలేజీ సమీపంలోని గ్యారేజీలో తన సొంతకారు బ్యాక్ సీటులో విగతజీవిగా కనిపించింది. రూత్ జార్జి హత్యతో యూనివర్షిటీ క్యాంపస్ లో విషాదం నెలకొంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రూత్ మరణం స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. చదువుతో పాటు.. జమ్నాస్టిక్స్ లో కూడా మంచి క్రీడాకారిణి రూత్ జార్జ్.

రూత్ జార్జిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్టు అమెరికా పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హత్యగా నిర్దారించారు. మెడపై తీవ్రగాయాలున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంపస్ సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె తెల్లవారుజామున శుక్రవారం 1.35 సమయంలో గ్యారేజీ వద్దకు నడుచుకుంటూ వచ్చినట్టు గుర్తించారు. అనంతరం 2.10కి హాల్ స్టెడ్ స్ట్రీట్ లో నడుచుకుంటూ కనిపించింది. తర్వాత ఆమె ఎటు వెళ్లిందన్నది తెలియలేదు. 2.30 తర్వాత హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

రూత్ జార్జ్ హత్యపై విచారణ జరుపుతున్న అమెరికా పోలీసులు సమీపంలోని బ్లూలైన్ రైల్వే స్టేషన్ వద్ద పాత నేరస్తుల కదలికలను గమనించారు. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నపాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూత్ జార్జి హత్యలో సంబంధం ఉందా అన్న కోణంలో అనుమానితుడుని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES