చై గారు.. మీ మనసులో.. : ఫిదా బ్యూటీ

చై గారు.. మీ మనసులో.. : ఫిదా బ్యూటీ

sai-pallavi-chaitu

శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్నారు. నవంబర్ 23న చైతూ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రోమో విడుదల చేసింది. ఆ రోజు అక్కినేని అభిమానులతో పాటు సాయి పల్లవి కూడా చైతూకి బర్త్‌డే విషెస్ తెలిపింది. సాయి పల్లవి చైతూకి పెట్టిన మెసేజ్‌లో.. మీ లాగే మీ మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనసులో ఏ కల్మషం లేకుండా అందంగా నవ్వుతారు. నిర్మలమైన హృదయం కలిగిన చై గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపింది. అందులో ఉన్న మెసేజ్ చైతూని ఆకర్షించింది. ఆమెకు రిప్లై ఇస్తూ ఓ రిక్వెస్ట్ చేశాడు చైతన్య. గారు అని పిలిచి నా వయసు పెంచేయొద్దు అని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి మద్య జరిగిన సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది.

Read MoreRead Less
Next Story