అలా చేయడం కరెక్టెేనా.. సమర్థిస్తున్నారు.. సమంతపై నెటిజన్స్ ఫైర్

అలా చేయడం కరెక్టెేనా.. సమర్థిస్తున్నారు.. సమంతపై నెటిజన్స్ ఫైర్
X

samantha

అభిమానం ఉండొచ్చు కానీ అది మరీ హద్దులు మీరకూడదు.. అని పలు సందర్భాల్లో మీ వాళ్లే చెబుతుంటారు. మరి ఈసారేమైంది ఆ అభిమాని చేసిన పనిని సమర్దిస్తున్నారు. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు. అందుకే ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉంటే మంచిది.. అంటూ సమంతను నెటిజన్స్ క్లాస్ పీకుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం.. పాపం సమంత ఎందుకు ఇరుక్కుంది మధ్యలో అని అనుకుంటే.. భర్త చైతూ పుట్టిన రోజని ప్రేమగా విషెస్ చెప్పింది.

ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీస్‌తో పాటు, అభిమానులు తమ ఆరాధ్య హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. అంతవరకు బాగానే ఉంది. మరో అభిమానికి మాత్రం అభిమానం కట్టలు తెచ్చుకుంది. అందుకే మోకాళ్లపై వెయ్యి మెట్లెక్కి స్వామి వారిని దర్శించుకున్నాడు. సింహాచలం గుడి మెట్లు ఎక్కిన అతడి పేరు సాగర్.. బొబ్బిలికి చెందిన ఆ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భర్త కోసం అంత సాహసం చేసిన ఆ అభిమాని పట్ల అతడికి గల ప్రేమను చూసి సమంత ఉప్పొంగిపోయింది.

ఆ వీడియోను షేర్ చేస్తూ థ్యాంక్ యూ.. ఇది చాలా గొప్ప విషయం. మాటలు రావడం లేదు. తప్పకుండా మీరు మమ్మల్ని కలవండి అంటూ రీ ట్వీట్ చేసింది. ఇక ఇది చూసి సమంతను ఒక ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఆమె రీ ట్వీట్‌పై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అభిమానులు అలా చేస్తుంటే వద్దని వారించాల్సింది పోయి.. వారేదో గొప్ప పని చేసినట్లు ప్రోత్సహించడం ఏంటని విమర్శిస్తున్నారు. ఇలా చేస్తే మిమ్మల్ని కలవొచ్చని మరి కొందరు తయారై ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం అభిమాని కష్టాన్ని, ప్రేమను గుర్తించిన సమంత గ్రేట్ అంటూ మరో వైపు పొగిడే వాళ్లూ ఉన్నారు.

Next Story

RELATED STORIES