చిత్తూరు జిల్లాలో మరో ఘటన.. బాలికపై అత్యాచారం

చిత్తూరు జిల్లాలో మరో ఘటన.. బాలికపై అత్యాచారం
X

చిత్తూరు జిల్లాలో ఓ కామంధుడుకి దేహశుద్ధి చేశారు స్థానికులు. కలికిరి మండలం కొట్టాల గ్రామానికి చెందిన వీరభద్రయ్య అదే గ్రామానికి చెందిన బాలికపై రెండు రోజుల కిందట అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడ్ని బహిరంగంగా ఉరి తీయాలని మహిళ, ప్రజా, విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఎస్సై రామంజనేయులను కలిసి నింధితుడ్ని బహిరంగంగా శిక్షంచాలని వినతి పత్రం అందించారు. అదే సమయంలో కొట్టాల గ్రామం నుంచి వస్తున్న వీరభద్రయ్యను గమనించిన స్థానికులు.. అతడ్ని పట్టుకొని చితకబాదారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. నిందితుడ్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేశాడు. దీంతో పోలీసులు సైతం వీరభద్రయ్యను చితకబాది పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Next Story

RELATED STORIES