సినిమా స్టంట్‌ని తలపించేలా.. గాల్లోకి ఎగిరి.. మెట్రో పిల్లర్‌ని ఢీ కొన్న కారు

హీరో రాజశేఖర్ కారు ప్రమాదాన్ని మరిచిపోకముందే.. సినిమా స్టంట్‌ను తలపించే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని LBనగర్ దగ్గర అతివేగం.. ఇద్దరు మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి వెళ్తున్న కారు.. అన్‌లిమిటెడ్ షాపింగ్ మాల్ దగ్గర రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీ కొట్టింది. అంతే.. గాల్లోకి పల్టీలు కొట్టింది. పక్కనున్న మెట్రోరైల్ పిల్లర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ సీన్ చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. షాక్ తిన్నారు. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ రూట్‌లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈమధ్యే జరిగిన యాక్సిడెంట్‌లో ఓ డాక్టర్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం చోటు చేసుకున్న ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com