తాజా వార్తలు

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కండక్టర్ రాజీనామా

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కండక్టర్ రాజీనామా
X

tttrrrsssసూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఎల్.కృష్ణ.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇన్నిరోజులుగా సమ్మె చేసినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు విధుల్లోకి వస్తామంటే లాఠీలతో కోడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగమే అయినా.. చాలీచాలని జీతంతో ఇన్నాళ్లు ఆత్మగౌరవంతో బతికానని చెప్పారు. కష్టాల్లో ఉంటే స్పందించకపోవడం తనని బాధిస్తోందని లేఖలో రాశారు. తన రాజీనామాను తక్షణం ఆమోదించాలని కోరారు. సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Next Story

RELATED STORIES