తాజా వార్తలు

సినీనటుడు సంపూర్ణేష్ బాబుకు తప్పిన ప్రమాదం

సినీనటుడు సంపూర్ణేష్ బాబుకు తప్పిన ప్రమాదం
X

sampu

సినీనటుడు సంపూర్ణేష్‌బాబుకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు

ఆయన కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సంపూర్ణేష్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద జరిగింది. బుధవారం సంపూర్ణేష్‌బాబు తన భార్య, పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అయితే సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. దీంతో కారు వెనుకభాగం దెబ్బతింది. ఘటనలో సంపూర్ణేష్, ఆయ‌న‌ భార్య‌, కూతురికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకి స‌మాచారం ఇవ్వ‌డంతో హుటాహుటిన సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుంటారు. సంపూ ఫ్యామిలీని ఆసుప‌త్రికి మరో కారులో తరలించారు.

Next Story

RELATED STORIES