మద్యం మత్తులో గొడవ.. కత్తితో దాడి

మద్యం మత్తులో గొడవ.. కత్తితో దాడి
X

knife

మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్యాయత్నానికి దారి తీసింది. సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్‌లో అప్పల్‌ రాజు అనే వ్యక్తిపై సిద్ధికుల్లా ఖాన్‌ కత్తితో దాడికి దిగాడు. దీంతో అప్పల్‌ రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే హోటల్‌లో పని చేస్తున్న ఇద్దరు.. మద్యం మత్తులో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సిద్ధికుల్లా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES