'పీరియడ్' సమస్య.. 'ఇర్రెగ్యులరే' పెద్ద సమస్య.. ఇలా చేస్తే..

పీరియడ్ సమస్య.. ఇర్రెగ్యులరే పెద్ద సమస్య.. ఇలా చేస్తే..

periods

నెలసరి సక్రమంగా వస్తేనే ఆరోగ్యం. ఒక్కోసారి మిస్సైనా పెద్ద సమస్యేమీ కాదని చెబుతుంటారు డాక్టర్లు. ఒకటీ, రెండు సార్లు అయితే పర్లేదు కానీ అదే కంటిన్యూ అయితే మాత్రం ఇబ్బందే. ఏదీ ప్లాన్ చేసుకోవడానికి ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బంది. సడెన్‌గా వస్తుందేమో అన్న ఆలోచనతోనే రోజులు గడపాల్సిన పరిస్థితి. బాడీ క్లాక్ సరిగా పనిచేయడం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఏ ఒక్కటి తప్పినా దేనికి దారితీస్తుందో అనే టెన్షన్. భవిష్యత్ పరిణామాలు కళ్లముందు కనిపించి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంటాయి. సరైన ఆహారపు అలవాట్లతో పాటు, శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే ఈ సమస్యను కొంత వరకు నివారించవచ్చు. ఇంట్లో పాటించే కొన్ని చిట్కాలు కూడా పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి సహకరిస్తాయి.

అల్లం: ఓ కప్పు నీటిలో టేబుల్ స్పూన్ తాజా అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఐదు నిమిషాలు మరిగిన తరువాత వడకట్టి ఓ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత తాగితే చక్కని ఫలితం ఉంటుంది.

సోంపు: పీరియడ్స్ సమస్యని కంట్రోల్ చేస్తుంది సోంపు. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ రెగ్యులరైజ్ కోసం రెండు టీ స్పూన్ల సోంపుని తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. సమస్య తగ్గే వరకు అంటే పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే వరకు వాడుతుండాలి.

apple-cider

దాల్చిన చెక్క: హర్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో దాల్చిన చెక్క పాత్ర ప్రముఖమైనది. రుతుక్రమ సమస్యలకు దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. పాలు అలవాటు లేకపోతే తీసుకుని ఆహరంపైన ఈ పొడిని చల్లుకుని తినవచ్చు. దీని వలన పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి.

క్యారెట్, ద్రాక్ష జ్యూసులు రుతుక్రమ సమస్యలను దూరం చేస్తాయి. ఆపిల్ సిడర్ వెనిగర్ కూడా సమస్యను పరిష్కరిస్తుంది. గ్లాస్ నీటిలో రెండు స్పూన్స్ ఆపిల్ సిడర్ వెనగర్ వేసుకుని భోజనానికి ముందు తాగుతుండాలి. తీసుకున్న తరువాత ఓ పది నిమిషాలు ఆగి భోజనం చేయాలి.

చివరిగా.. ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం రుతుక్రమ సమస్యలకు కారణమవుతుంది. ఇందుకోసం ప్రతి రోజు ఓ పది నిమిషాలు ప్రశాంతంగా కళ్లు మూసుకుని ధ్యానం చేయడం మంచిది. దాంతో పాటు సూర్య నమస్కారాలు చేయడం వలన శరీరంలోని అన్ని అవయవాలు యాక్టివేట్ అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సమస్య తగ్గుతుంది.

Read MoreRead Less
Next Story