తాజా వార్తలు

వరంగల్ జిల్లాలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్

వరంగల్ జిల్లాలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్
X

rape

వరంగల్ రూరల్ హన్మకొండలో ఓ యువతి తన పుట్టినరోజు నాడే మృగాళ్లకు చిక్కి బలైపోయింది. గుడికి వెళ్లొస్తానని, అట్నుంచి స్నేహితుల్ని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. రాత్రికి విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో శవంగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు షాకైపోయారు. కూతురు కనిపించకుండా పోవడంతో వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు.. చివరికి జరిగిన ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని బట్టి ఆమె గ్యాంగ్‌రేప్‌కు గురైనట్టు పోలీసులు చెప్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

హంటర్‌రోడ్డు సమీపంలోని ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంటుంది. చెట్లు తుప్పలతో నిండిన చోటు కావడంతో నిందితులు యువతిని ఇక్కడికి తీసుకొచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఆమె డెడ్‌బాడీకి సమీపంలోనే బీరు బాటిళ్లు ఉండడం గుర్తించారు. ఇతర క్లూస్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.

Next Story

RELATED STORIES